యూనిట్
Flash News
దేవాలయాలలో కలశాలను దొంగిలించే ఘరానా ముఠా అరెస్టు
కొన్ని రోజుల క్రితం
కొత్తపాలెం మరియు ఈధూరు గ్రామాలలోని దేవాలయాలలో ద్వజస్థoభానికి
కలిగి వుండిన కలశాలను దొంగ తనానికి గురైనాయి. దొంగ తనలపై తోటపల్లి, గూడూరు పోలీసుస్టేషన్ లలో పిర్యాధులు అందినట్లు
డిఎస్పీ రాఘవరెడ్డి తెలిపారు. కేసు
వివరాలను అయన వెల్లడించారు. దొంగతనాలను అరికట్టడానికి
నెల్లూరు జిల్లా భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు కృష్ణపట్నం
సి ఐ ఖాజావళి తన
సిబ్బందితో మూడు చోట్ల వాహనాలు తనిఖీ చేపట్టారు. మంగళవారం
తెల్లవారుజామున 03.00 గంటలకు రాబడిన సమాచారం ప్రకారం రావూరి
వారి కండ్రిగ గ్రామం
లో వాహన తనికీ చేపట్టారు. ఆ సమయంలో ఒక కారు లోని వ్యక్తులు పోలీసు వారిని చూసి ఆపుకొని
కారు దిగి పారిపోతుండగా ఎస్సై మరియు
సిబ్బంధి వారిని పట్టుకొని విచారించినరు. వాహనాన్ని తనిఖీ చేయగా ఆ
వాహనంలో దేవాలయాలకు సంబందించిన 3 కలశాలు వున్నాయి. కారులో వున్న వట్టికాళ్ళ
మాధవరావు, ఒరుంపాటి రాజ, షేక్ షఫి,
వడ్డిపల్లి ఈశ్వర్, ఆరికాటి శ్రీకాంత్,
గుండాల వెంకటేశ్వర్లు అలియాస్ చంటి,
షేక్ ఆమన్
ఖాధర్ సుల్తాన్ బాషా, దుడ్డు
రమేశ్ బాబు మరియు శీలం వెంకటేశ్వర్లు లను అరెస్ట్ చేసారు. వారి వద్ద నుండి 2
లక్షలు రూపాయలు విలువ చేసే కలశాలు- 2 మరియు పది లక్షలు విలువ
చేసే ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నారు.