యూనిట్
Flash News
400 కిలోల గంజాయి స్వాధీనం
తూర్పుగోదావరి నుండి తమిళనాడుకు అక్రమంగా గంజాయిని
తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ముఠాను ప్రకాశం జిల్లా పోలీస్ లు పట్టుకుని అరెస్ట్
చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్దర్ద్ కౌశల్ తెలిపారు. కేసు వివరాలను అయన
వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, రాజ ఒమ్మంగి పరిసర
ప్రాంతాల నుండి గంజాయి తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. శుక్రవారం
ఉదయం ఒంగోలు డిఎస్పీ ఆధ్వర్యంలో మూడు బృందాలు
ఉప్పుగుండూరు గ్రామం వద్ద వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
సుమారు ఉదయం ఏడుగంటల సమయంలో చీరాల
నుండి ఒంగోలు వైపుకు వెళ్లే మార్గంలో ఒక స్విఫ్ట్
డిజైర్ కారు మరియు లారీ పోలీస్
సిబ్బంది ఆపిన ఆపకుండా వెళ్ళిపోయినాయి. వెంటనే సిబ్బంది వాటి వెనుకపడి ఆరు
కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. రెండు వాహనాలు నుండి సుమారు రూ 25 లక్షల విలువైన 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు
చెందిన ముఠా సభ్యులు జయబల్ అరివలాహస్, కార్తీక్ కనకరాజు,
తంగయ్య రాజ్ తేవర్ మరియు దేవరాజ్ అలగుమలై లను అరెస్ట్ చేసినట్లు
పేర్కొన్నారు. గంజాయి స్వాధీనం చేసుకున్న దానిలో ఉత్తమ పనితీరు కనబర్చిన
సిబ్బందిని ఎస్పీ అభినందించారు.