యూనిట్
Flash News
ఆన్ లైన్ లాటరీల ఉచ్చులో పడొద్దు- కర్నూలు ఎస్పీ ఫకీరప్ప
మీకు ఆన్ లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే
పేరు తో మీకు ఇంటికి ఏదైన కొరియర్ పోస్ట్ వచ్చి మీ ఫోన్ నంబర్ లక్కీ డ్రా లో ఎంపిక
అయ్యింది, మీరు బహుమతిగా ఒక కారు గెలుచుకున్నారు అని వచ్చిందా ! మీరు దానిని నమ్మి
అందులో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదిస్తున్నారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల
బారిన పడే అవకాశం ఉంది....జాగ్రత్తగా వ్యవహరించండి .
ఈ తరహా మోసంలో మొదటగా సైబర్ నేరగాళ్లు మీ ఇంటికి కొరియర్ పోస్ట్
పంపించి మీరు ఒక బహుమతి గెలుచుకున్నారు. మీరు ఏ బహుమతిని గెలుచుకున్నారో
తెలుసుకోవడం కోసం ఈ స్క్రాచ్ కార్డు ను స్క్రాచ్ చేయమని ఉంటుంది.
మీరు ఆ స్క్రాచ్ కార్డు లో ఏముందో తెలుసుకోవాలనే అనే ఉత్సాహంతో దానిని
స్క్రాచ్ చేయగా అందులో మీకు బహుమతిగా ఒక కారు లాటరీ తగిలిందని దానిని పొందడానికి మీరు ఈ క్రింది
నెంబర్ ను సంప్రదించగలరు అంటూ ఉంటుంది, మీరు ఆ నంబర్ ను
సంప్రదించినట్లయితే, రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రొసెసింగ్ ఫీజు, డెలివరీ చార్జీలని కొంత
నగదు మొత్తాలను కట్టమంటారు. వాటిని కట్టిన తర్వాత సైబర్ నేరగాళ్ళు మొబైల్
స్విచ్ ఆఫ్ చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతుంటారు.
ఈ తరహా మోసంతో కోయిలకుంట్ల మండలంలోని కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన
ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేయడం జరిగినది , మొదటగా
సైబర్ నేరగాళ్లు ఆ వ్యక్తికి కొరియర్ పోస్టు ద్వారా పామ్ -
ప్లేట్ రూపంలో ఉన్న ఒక పేపర్ ను పంపారు. మీరు ఒక బహుమతి గెలుచుకున్నారు , మీకు ఏ బహుమతి వచ్చిందో తెలుసుకోవడం కోసం ఈ స్ర్కాచ్
కార్డు ను స్క్రాచ్ చేయండి అంటూ ఉంది. ఆ వ్యక్తి ఆ స్క్రాచ్ కార్డు ను స్ర్కాచ్ చేయగా
అందులో ఒక కారు ఉంది , మీరు ఈ బహుమతిని పొందటం కోసం ఈ
క్రింది నంబర్ ను సంప్రదిoచగలరు అంటూ అందులో ఉంది. ఆ
వ్యక్తి ఆ నంబర్ ను సంప్రదించిన తర్వాత బాధితుని నుండి రిజిస్ట్రేషన్
ఫీజు రూ. 35,600/- ప్రోసెసింగ్ ఫీజు రూ. 42,800/- డెలివరి చార్జీలు రూ.13,400/- జిఎస్టీ రూ.15,000/-
లను కట్టించుకున్నారు, ఆ తర్వాత బాధితుడు ఆ
నంబర్ ను సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ఇలా వివిధ
రూపాలలో బాధితుని నుండి మొత్తం నగదు రూ. 1,06,800/- వారి
ఖాతాలలోకి వేయించుకున్నారు. తరువాత మోసపోయానని గ్రహించిన బాధితుడు
పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. కావున అటువంటి వాటిని నమ్మకండి, జాగ్రత్తగా వ్యవహరించండి.
ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక
పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా
సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి
ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్
గారు తెలిపారు.