యూనిట్

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

నెల్లూరు జిల్లా నాయుడు పేట ప్రాంతంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను నాయుడుపేట పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసినట్లు నాయుడు పేట సి ఐ జి వేణుగోపాల రెడ్డి తెలిపారు. కేసు వివరాలను వెల్లడించారు. దేవత సాయి అలియాస్ వెంకటశాయి, అట్లా సాయిరామ్, దువ్వూరు వంశీ కృష్ణ రెడ్డిలు ఒక ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. ఒక ఆటో ను కూడా దొంగలించారు.చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలు చేస్తున్నారు. నాయుడు పేట పోలీస్ లకు వచ్చిన సమాచారం మేరకు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని తెలిపారు. వారి వద్ద నుండి ౩. 5 లక్షల విలువ చేసే ఆటో, 8 1/2 సవర్ల బంగారం చైన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎస్సై డి. వెంకటేశ్వర రావు, హెడ్ కానిస్టేబుల్స్  షేక్ కరీం, పి. తిరుపతి రావు, కానిస్టేబుల్స్ దయాకర్, శ్రీనివాసులు, బి శంకరయ్య, హరికృష్ణ, తదితరులను సి ఐ అభినందించారు. 

వార్తావాహిని