యూనిట్
Flash News
అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు
నెల్లూరు
జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాల కేసులు చేధించాలని ఎస్.పి.
ఐశ్వర్య రస్తోగి అధికారులను ఆదేశించారు. డిఎస్‌పిలు, ఇతర అధికారులకు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు. డిఎస్‌పి
కె.వి.రాఘవ రెడ్డి పర్యవేక్షణలో సీఐల బృందం దృష్టి సారించింది. ఇందుకూరుపేట
సీసీఎస్‌కు వచ్చిన సమాచారము మేరకు నాలుగు కాళ్ళ మండపం వద్ద తిరుపతిస్వామి, లక్ష్మిపతి నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు ఎస్.పి.తెలిపారు.
నిందితులను విచారించగా నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట, నెల్లూరు
రూరల్, ఏఎస్ పేట, బాలాయపల్లి
పోలీస్ స్టేషన్ల పరిధిలో 7 కేసులు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు
పరిధిల్లో మొత్తం 18 ఇంటి దొంగతనాలు, 3 కార్ల దొంగతనం చేసినట్లుగా అంగీకరించారు. ఇవేకాక మొదటి నిందితుడైన
తిరుపతి స్వామి ఇంతకూ మునుపు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ, ఖమ్మం,
అనంతపురం, చిత్తూరు, కర్నూల్ జిల్లాల్లో జైలు శిక్ష అనుభవించిన పాతనేరస్థుడు. నిందితులైన
పెద్దినేని తిరుపతి స్వామి, లేదోటి లక్ష్మీపతిలను అరెస్ట్
చేసి, నేరములుకు సంబంధించిన చోరీ సొత్తు బంగారు వెండి
ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.పి. ఐశ్వర్య రస్తోగి తెలిపారు. కేసును
చాకచక్యంగా చేధించిన సిబ్బందిని ఎస్.పి. అభినందించారు.