యూనిట్
Flash News
స్కిమ్మింగ్ మిషన్‌తో ఏటీఎంలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
కొంత
కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏటీఎం సెంటర్‌లలో స్కిమ్మింగ్ మిషన్
ద్వారా ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి నేరాలకు పాల్పడుతున్న ముఠాను
పట్టుకునేందుకు నెల్లూరు ఎస్.పి. ఐశ్వర్య రస్తోగి దృష్టి సారించారు. ముఠాను
నెల్లూరు రైల్వేస్టేషన్ వద్ద ఎస్‌బిఐ ఏటీఎం వద్ద గుర్తించి అరెస్టుచేసినట్లు ఎస్.పి.
తెలిపారు. ఈ మోసాలకు పాల్పడే ముఠాలో సందీప్ కుమార్, మంజీత్, జగ్జీత్
ఇలా వీరు రాష్ట్రవ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైం దని ఎస్.పి.
తెలిపారు.వీరినుంచి నగదు, స్విఫ్ట్ కారు, స్వైపింగ్ మిషన్‌లు, రీడర్‌లు, మొబైల్, లాప్‌టాప్‌లను స్వాధీనం
చేసుకున్నట్లు తెలిపారు. వద్దులు, ఏటీఎం కార్డు
ఉపయోగించడం తెలియని వారే మెయిన్ టార్గెట్ చేసుకొని స్కిమ్మింగ్ మిషన్ ద్వారా
ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేస్తుంటారని చెప్పారు. వద్దులు, ఏటీఎంను ఉపయోగించడం తెలియని వారు ఏటీఎం వద్దకు వచ్చి వారికి సహాయము
చేస్తున్నట్లుగా నటిస్తూ ఏటీఎం వద్ద వారి పిన్ గమనించి వారికి మంచి మాటలు
చెప్పుతూ వారి యొక్క కార్డులను మార్చి తమ వద్ద ఉన్న డూప్లికేట్ కార్డులను వారికి
ఇచ్చి తమ వద్ద ఉన్న స్వైప్ మెషిన్‌తో స్వైప్ చేసి కార్డులోని డబ్బును డ్రా
చేస్తారని అన్నారు. కేసును చేధించుటలో చాకచక్యంగా వ్యవహరించిన డిఎస్‌పి
శ్రీనివాసులురెడ్డి, ఇన్స్‌పెక్టర్‌లు శ్రీమతి
ఎం.నాగేశ్వరమ్మ, శ్రీనివాసన్, షేక్
బాజీజాన్‌సైదా, ఎస్.ఐ.లు, ఇతర
సిబ్బందిని ఎస్.పి. అభినందించి, రివార్డులు అందజేశారు.