యూనిట్

అనుమానమే పెనుభూతమై..... భార్య, బిడ్డలను హతమార్చిన కసాయి భర్త

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట-లింగంగుంట గ్రామపొలాల్లో ఈ నెల 3న హత్యకు గురైన తల్లీబిడ్డల కేసు చిక్కుముడి   వీడింది.  అద్దంకి పట్టణం భవానీ సెంటర్‌లో నివాసం ఉండే హతురాలి భర్త అద్దంకి కోటేశ్వరరావును నిందితుడిగా గుర్తించి  అరెస్టు చేసినట్లు  జిల్లా ఎస్పీ సిధార్థ కౌశల్‌ తెలిపారు. కేసు వివరాలను అయన వెల్లడించారు.   అద్దంకి కోటేశ్వరరావు  కజికిస్థాన్‌లో ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్లి మధ్యలోనే తిరిగివచ్చాడు. ఈ క్రమంలో నెల్లూరులో ఎస్సి కులానికి చెందిన  శ్రీ లక్ష్మి ఒంగోలులో ఉంటూ అతనికి పరిచయమైంది అది ప్రేమ గా మారింది. 2018 ఏప్రిల్‌ 28న గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గరలోని భీమవరంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో వారికి పాప పుట్టింది.  అప్పటి నుండి  నిందితుడు  భార్య పై అనుమానం పెంచుకున్నాడు. పాప  కూడా తనకు పుట్టలేదనే  భావనతో ఉండేవాడు. ఎలాగైనా తల్లి కూతుళ్లను హత్య చేయాలని పథకం రచించాడు. పథకం ప్రకారం అతను పనిచేసే ఆసుపత్రిలో ఈ నెల 3న విధులలో ఉన్న   తన సహ ఉద్యోగి అయిన సుకుమార్‌ మోటారు సైకిల్‌ను తీసుకున్నాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒంగోలులో బ్యాంకు పని ఉందని చెప్పి శ్రీలక్ష్మి, వైష్ణవిలను మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. మార్గమధ్యలో మద్దిపాడు కొష్టాలు సెంటర్‌ వద్ద పెట్రోలు బంకులో ఖాళీ బాటిల్‌లో పెట్రోలు పోయించుకున్నాడు. ఆ తర్వాత మారెళ్లగుంటపాలెం-పేర్నమిట్ట గ్రామాల మధ్య ఉన్న పొలాల్లోకి ఇద్దర్నీ తీసుకెళ్లాడు. అక్కడ తనతోపాటు ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న కత్తితో కిరాతకంగా ఏడాది పాప గొంతుకోశాడు. శ్రీలక్ష్మిని రాయితో పలుమార్లు మోది హతమార్చాడు. అనంతరం వారి పై పెట్రోల్ వేసి కాల్చివేసాడు.  ఎటువంటి అధరాలు లేని కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించి నిందితుడ్ని అరెస్ట్ చేసిన  ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి. ప్రసాదు  మరియు  అతని బృందానికి  ఎస్పీ  ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. 

వార్తావాహిని