యూనిట్

3000 నాటు సారా ప్యాకెట్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

నాటు సారాపై అనంతపురం జిల్లా పామిడి రూరల్ పోలుసులు ఉక్కు పాదం మోపారు. ఆదివారం భారీ ఎత్తున 3000 నాటు సారా ప్యాకెట్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేస్తున్నారు. వీటిని తరలిస్తున్న ఒకర్ని అరెస్టు చేశారు. మరోకరు అరెస్టు కావాల్సి ఉంది. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు... తాడిపత్రి డీఎస్పీ పర్యవేక్షణలో పామిడి రూరల్ సి.ఐ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాటు సారా స్థావరాలు మరియు అక్రమ రవాణాపై దృష్టి సారించారు. ఈ బృందం జరిపిన దాడులలో భాగంగా... చింతలయపల్లి -- కుందన కోట మధ్యలో తనిఖీ చేశారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం సీతమ్మ తండా గ్రామానికి చెందిన ఓబునాయక్ , మరొక వ్యక్తి రెండు ద్విచక్ర వాహనాల్లో రాగా ఓబు నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి ద్విచక్ర వాహనం వదలి పరారయ్యాడు. ఆ సందర్భంగా మొత్తం 3000 పాకెట్స్ (300 లీటర్స్) నాటు సారా మరియు 2 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.

** నెల క్రితం కూడా...

యాడికి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంతవరకు 23 మంది నిందితులను, 6 మోటార్ బైకులను,700 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.

** తాడిపత్రి పట్టణంలో...

తాడిపత్రి టౌన్ లో తాటియాకుల ఓబుళేసు, షేక్ రమీజాలను అరెస్టు చేసి  107 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

వార్తావాహిని